
జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానందం గౌడ్ మెదక్ జిల్లా
చిలప్ చెడ్ మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో అన్ని గ్రామాలలో గ్రామసభలను విజయవంతం చేయాలి అని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానందం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆనంద్, తహసిల్దార్ సహదేవ్, ఎంపీఓ తిరుపతి, ఏపీఎం గౌరీ శంకర్,పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు