
(జనం న్యూస్, బెజ్జరపు శ్రీనివాస్ జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ) 1 ఏప్రిల్, 2026.
జనం న్యూస్, ఏప్రిల్ 1, జగిత్యాల జిల్లా, కోరుట్ల నియోజకవర్గం, మెట్ పల్లి : పట్టణంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు యం. డి .షాకీర్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనారిటీ, వికలాంగ పెన్షన్ శాఖ మంత్రి (అడ్లూరి లక్ష్మణ్ )జన్మదిన వేడుకలు మెట్ పల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. యం. డి షాకీర్ ఆధ్వర్యంలో ఆస్పత్రి లలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం తదుపరి 12వ వార్డు మహిళా మండలి అంగన్వాడి సెంటర్లలో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు యం.డి షాకీర్ మాట్లాడుతూ ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ వికలాంగుల పేదవారి గురించి పేద కుటుంబం నుంచి వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆశాజ్యోతి అని జగిత్యాల జిల్లాని అభివృద్ధి ప్రాంతంలో తీసుకొని వెళుతున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ క్షేమంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని ఇటువంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులతో ప్రజలకు సేవ చెయ్యాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. జగిత్యాల జిల్లాని ఇంకా అభివృద్ధి తో ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్ రెడ్డి ,పి వాణిశ్రీ , ఇస్మాయిల్ ఖాన్, ఖలీమ్ బేగ్, రహీం ,చాంద్ ,సోనియాగాంధీ సమైక్య సంఘం అధ్యక్షురాలు అరిసెల మాధవి ,మాజీ అధ్యక్షురాలు, పిట్ల లావణ్య, స్వప్న, నరసమ్మ, హసీనా, రాజ్వన తదితరులు పాల్గొన్నారు.