
జనం న్యూస్ 02 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
16 వార్డు నందు పట్టణ ప్రకృతి వనం ప్రారంభోత్సవం, బస్తీ దౌఖాన కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే…
ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని 16 వార్డు నందు పట్టణ ప్రకృతివనం ప్రారంభోత్సవానికి, మరియు బస్తీ దవాఖాన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా డిసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి హాజరయ్యారు…పట్టణ ప్రకృతి వనం పార్కును రిబ్బన్ కటింగ్ చేసి ఎమ్మెల్యే ప్రారంభించడం జరిగింది …అదేవిధంగా బస్తీ దవఖాన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగినది …ఎమ్మెల్యే కి వార్డ్ కౌన్సిలర్ శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు .ఎమ్మెల్యే మాట్లాడుతూ… జోగులాంబ గద్వాల పట్టణంలోని ప్రతి వార్డ్ పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరిగినదని అన్నారు.వార్డులోని ప్రజలు చిన్న పిల్లలు పెద్దలు కాసేపు ప్రశాంతంగా గడపడానికి పార్కు లో మంచి పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తో ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు వాకింగ్ చేయడానికి యోగ చేయడానికి ఎంతో ఉపయోగకరమైనది. పిల్లలకు కూడా ఆడుకోడానికి అన్ని రకాల హంగులతో పార్కును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు..అదేవిధంగా వార్డులో ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సిన సమయంలో వాడు లోనే అతి సమీపంలో ఆసుపత్రి ఏర్పాటు చేసి ఇక్కడ వాడు ప్రజలకు అవసరమైన డాక్టర్ సిబ్బందిని, మందులను ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ప్రజల ఆరోగ్య క్షేమంగా ఉండాలని లక్ష్యంతో ప్రభుత్వం బస్తీ దవఖాన నిర్మాణం చేయడం జరుగుతుందని కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రతి ప్రతి వార్డ్ ప్రతి ఒక్కరు కలిసిమెలిసి వార్డ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అప్పుడే గద్వాల పట్టణం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు..
భవిష్యత్తులో గద్వాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలిపారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నరసింహులు యాదవ్, వైస్ చైర్మన్ శంకర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్ బాబర్, కౌన్సిలర్స్ వేదవతి వెంకటేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్, గోవిందు, రామలింగేశ్వర కాంమ్లే, సత్యం , మాజీ కౌన్సిలర్స్ మురళి నరహరి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ విష్ణు, ఆలయ కమిటీ డైరెక్టర్ అక్కల శ్రీనివాసులు నాయకులు సాయి శ్యామ్ రెడ్డి, బంగి సుదర్శన్, రామయ్య శెట్టి, కురుమన్న లక్ష్మన్న, బీచుపల్లి, రంగారెడ్డి గంజిపేట మధు, రమేష్ రెడ్డి, వినోద్, కేశవరెడ్డి, నాగ శంకర్, సుధాకర్ రెడ్డి, ఇలియాస్, శ్రీధర్, మధు రామకృష్ణ, యోగి,నవీన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.