
జుక్కల్ ఏప్రిల్ 2 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని నాగుల్ గావ్ గ్రామ పంచాయతీలో శనివారం ఉదయం 10 గంటలకు గ్రామసభను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభకు గ్రామ సర్పంచ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మౌలిక వసతులు కల్పన, ఇతర గ్రామ సమస్యలను కూలంకషంగా చర్చించడం జరిగింది. సందర్భంగా జిపి పాలకవర్గం ప్రజలతో పలు గ్రామ సమస్యల పరిష్కారం కొరకు చర్చించడం జరిగింది. ఇట్టి సమస్యలని త్వరితగతంగా పరిష్కరిస్తామని సర్పంచ్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం ఉపాధి హామీ, నర్సరీ, లేబర్ మొగలైజేషన్, ఇందిరమ్మ ఇళ్ల పనులు పూర్తి చేయాలని, నీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలు చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అమృత , కార్యదర్శి లింగూరం, గ్రామస్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
