
జనం న్యూస్ ఏప్రిల్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
మూడు శతాబ్దాల క్రితమే పేదల పక్షాన పోరాట పతాకాన్ని ఎగురవేసిన మహానాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ కొనియాడారు. గురువారం మోతీనగర్‌లో గౌడ సంఘం ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ 319వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బండి రమేష్ గౌడ సోదరులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, నాటి పాలకుల అన్యాయాలు, అవినీతిపై సర్దార్ పాపన్న గౌడ్ చేసిన పోరాటం నేటి యువతకు మార్గదర్శకమని అన్నారు. సమాజంలో అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, సమానత్వం కోసం పోరాడిన గొప్ప యోధుడిగా ఆయనను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
పాపన్న గౌడ్ జీవితం ధైర్యం, త్యాగం, న్యాయం కోసం నిలబడే సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని రమేష్ పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో న్యాయం, సమానత్వం నెలకొల్పాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో గంట శ్రీనివాస్ గౌడ్, సంజీవ్ గౌడ్, హనుమంతు గౌడ్, శ్రీశైలం యాదవ్, రాజు శేఖర్, కొప్పిశెట్టి దినేష్, గాలి బాలాజీ, గొట్టుముక్కలు వెంకటేశ్వరరావు, దేశాలు, సంతోష్, సాయిబాబా చౌదరి, బర్కత్ ఆలీ, కనకయ్య, రఘు, సుంకన్నా, గోవింద్, కల్పన తదితరులు పాల్గొన్నారు.
