
జుక్కల్ ఏప్రిల్ 2 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం జుక్కల్ గ్రామపంచాయతీ పరిధిలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా గ్రామసభ సమావేశం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించడం జరిగింది.. కార్యక్రమానికి సర్పంచ్ సావిత్రి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి ఎజెండా అంశములను చదివి వినిపించి ఆమోదం తెలుపుతూ తీర్మానం చేయడమైనది.. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కారపు దిశగా తీర్మానం చేయనైనది.. ఇది సమావేశానికి మండల ప్రత్యేక అధికారి జడ్పి సీఈఓ చంద్ర నాయక్ , ఎంపీడీవో శ్రీనివాస్ , హౌసింగ్ డిఈ గోపాల్ సార్, ఉప సర్పంచ్ షేక్ ఫిర్దోస్, ఎక్స్ సర్పంచ్ లు సాయగౌడ్ ,రాములు , ఇమ్రాన్ ఖాన్ ,విజయ్, గ్రామస్థాయి అధికారులు మహిళా సంఘ సభ్యులు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…