మద్నూర్ ఫిబ్రవరి 13 జనం న్యూస్ ; కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మార్కెట్ కమిటీ ఆవరణలో బుధవారం సాయంత్రం సోయా పంట కొనుగోలు చేయాలని ఓ రైతు ఆత్మహత్య ప్రయత్నం చోటుచేసుకుంది జనవరి 7న అధికారులు సోయా కొనుగోలు కేంద్రాన్ని మూసి వేశారు అప్పటికే మార్కెట్ యార్డులో ఉన్న పంటను కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేశారు దీంతో ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు వచ్చి సోయా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు అయినప్పటికీ పంట కొనకపోవడంతో ఆందోళన చెందిన మద్నూర్ మండలం లింబూరు గ్రామానికి చెందిన రైతు చెట్టు ఎక్కి అయినా దగ్గర ఉన్న టవల్‌తో ఉరి వేసుకోవడానికి ప్రయత్నించాడు సొసైటీ కార్యదర్శి బాబురావు పోలీసులు వచ్చి రెండు రోజుల్లో సోయా కొనుగోలు కేంద్రాన్ని ఆరంభిస్తామని హామీ ఇవ్వడంతో దిగి వచ్చాడు