
జనం న్యూస్ 02 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం గట్టుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో లో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ సభ ద్వారా అవగాహన సదస్సు సర్పంచ్ పద్మ రాజు, ప్రత్యేక అధికారి ఎల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. పంచాయతీ సెక్రెటరీ అబ్దుల్లా ఎజెండా అంశాలను చదివి వినిపించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పద్మ రాజు గ్రామ సమస్యలపై మాట్లాడుతూ.. నీటి సమస్య, అండర్ డ్రైనేజ్, రోడ్ల, పారిశుద్ధ్యం, గ్రామ అభివృద్ధి దిశగా వారు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ మనీల, ఆశ వర్కర్ మంజుల, ఉప సర్పంచ్ శౌరెడ్డి, వార్డ్ నెంబర్లు దోమ రవి, కావలి చంద్రశేఖర్, నర్సిములు, బొల్లి మంజుల, దోమ సంతోష, సరిత సురేష్ రెడ్డి, బొల్లి స్వప్న, మరియు ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.