
జనం న్యూస్ ఏప్రిల్2: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని
బట్టాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ ప్రవీణ్ యాదవ్ అధ్యక్షతన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామసభ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి అధికారులు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇంకా అవసరమైన సదుపాయాలపై వివరాలు చదివి వినిపించారు. ప్రత్యేక అధికారిఎంపీడీవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామ ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పై అధికారులకు తెలియజేస్తామని అన్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భూషణ వేణి ప్రవీణ్ యాదవ్, ఉప సర్పంచ్ మూడ్ దయానంద్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం ప్రజాక్షేత్రంలో ఉండి తమవంతు 100 శాతం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సారంగి ముత్తెమ్మ, పోకల్కార్ గణేష్, మాలవత్ భీమానాయక్, మౌనిక, హేమలత, నీలిమ, అరవింద్, పంచాయతీ కార్యదర్శి ఆకుల రవి, జిపిఓ సంపత్, కారోబార్ కొండ శంకర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వేణు గౌడ్, సభ్యులు మహిపాల్ రెడ్డి, చిన్న రెడ్డి, మూడ్ భీముడు నాయక్, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.