
జనం న్యూస్ 03 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
సిపిఐ నమూనా భారత్ ది మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ నమూనా ఇజ్రాయల్ యూదుల దా?లేక నాజీల హిట్లర్ దా? చెప్పాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు యం బాల్ నరసింహ సిపిఐ పార్టీ పోరాటాలకు విరివిగా విరాళాలు ఇవ్వండిని విజ్ఞప్తి దేశ ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోశాఖ మంత్రి అమిత్ షాలకు కమ్యూనిస్టులంటే ఎందుకంత భయమని ఏప్పుడు చూసిన పార్లమెంట్ లో అలాగే బయట కమ్యూనిజం మరియు కమ్యూనిస్టు పార్టీల గురించే మాట్లాడుతుంటారని వారికెందుకు అంత భయం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ విమర్శలు గుప్పించారు. సిపిఐ నమూనా భారత్ దే నని దానికి ఉదాహరణ సిపిఐ ఈ దేశం స్వాతంత్రం కోసం, రాచరిక విముక్తి కోసం వివిధ రకాల ఈ దేశ అభివృద్ధికై జరిగిన ప్రజా ఉద్యమాలు త్యాగాలలో చాలా కీలక పాత్ర పోషించిందని మరి ఆర్ఎస్ఎస్ బిజెపి నమూనా ఇజ్రాయిల్ యూదులదా లేక జర్మనీ నాజీల హిట్లర్ దా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడ ఏనాడు ఈ దేశం కోసం పోరాటాలు చేయని వారు త్యాగాలు చేయని వారు మాట్లాడడం దెయ్యాలు వేదాలని వల్లించినట్లేనని పేర్కొన్నారు.పార్లమెంట్లో అమిత్ షా సిపిఐ పార్టీ పైన కమ్యూనిస్టుల పైన చేసిన కామెంట్లకు కౌంటర్ గా బాల నరసింహ కౌంటర్ అటాక్ చేశారు.గురువారం నాడు స్థానిక సిపిఐ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన సిపిఐ పార్టీ జిల్లా సమితి సమావేశంలో ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా దేశంలో కమ్యూనిస్టులు బలపడాలని లేకపోతే ప్రశ్నించే శక్తులు కనుమరుగవుతాయని అడిగే వాళ్ళు లేక దేశంలో విచ్చలవిడిగా విధ్వంసకరమైన పరిపాలన మత విధానాలు కొనసాగి ఐక్యతను దెబ్బతీసి తీవ్ర ప్రమాదాన్ని తెచ్చిపెడతాయని పేర్కొన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందువల్లనే మోడీ అమిత్ షా లాంటి వాళ్లు కమ్యూనిస్టులను, కమ్యూనిజాన్ని,పోరాటం చేసే వాళ్ళని,ప్రశ్నించే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు.గద్దర్ లాంటి తెలంగాణ జాతిపితను పార్లమెంటు సాక్షిగా విమర్శించడం అంటే ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఇంకొకటి లేదని ఆగ్రహం వెలిబుచ్చారు. నెహ్రూ దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచంలో జరుగుతున్న నాటో కూటమి కమ్యూనిస్టు కూటముల మధ్య యుద్దాలను జరగకూడగా అలీన విధానంతో ఆపేవారని ఆయన స్పష్టం చేశారు.కానీ నేడు మోడీ ట్రంప్ కు భయపడి ప్రపంచంలో శాంతి భారత దేశ భవిష్యత్తు కొరకు ఏమాత్రం యుద్ధాలను ఆపే సాహసం చేయడం లేదని విమర్శించారు. ట్రంప్ చమురు గ్యాస్ పెట్రోలియం ఉత్పత్తుల దేశాలపైన ఉద్దేశపూర్వకంగా దాడులకు తెగబడుతున్నారని ఇది ప్రపంచ శాంతికి విఘాతమని,కావున ఈ గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.సిపిఐ శతాబ్ది కాలం నుంచి చేసిన పోరాటాలు, త్యాగాలు ఎన్నెన్నో చెప్పలేనివని భవిష్యత్తు మరిన్ని ఉద్యమాలకోసం గడప గడపకు సిపిఐ విరాళాల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అలాగే గద్వాల జిల్లా కేంద్రంలో సురవరం సుధాకర్ రెడ్డి పేరుతో ఏర్పాటు చేసే సిపిఐ జిల్లా కార్యాలయం నిర్మాణానికి పెద్ద ఎత్తున సహకరించగలరనీ కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఆశన్న,నాగార్జున,కాశీం ఎ ఐ వ్ యాప్ , ఉప్పేరు కృష్ణ ఎ ఐ యస్ ఎఫ్ ప్రవీణ్,వెంకటేష్, సీనియర్ నాయకులు సురేష్, న్యాయవాది రమేష్, పాల్, వెంకట్రాములు రాము తదితరులు పాల్గొనడం జరిగింది.
భారత కమ్యూనిస్టు పార్టీ సి పి ఐ జోగులాంబ గద్వాల జిల్లా