
జనం న్యూస్ ఏప్రిల్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం
అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలనే సంకల్పానికి పార్లమెంటులో చట్ట బద్ధత రావడం రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మక విజయమని కాట్రేనికోన డీసీ చైర్మన్ ఆకాశం శ్రీనివాస్ తెలిపారు,కాట్రేనికోన మండల పరిధిలో కందికుప్ప సచివాలయంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహించారు, అలాగే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చేస్తున్న కృషికి, ఈ నిర్ణయం మరింత బలాన్ని చేకూర్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కందికుప్ప సొసైటీ చైర్ పర్సన్ నూకల మూర్తి,ఐ టిడిపి అధ్యక్షుడు విత్తనాల భార్గవ్, నాయకులు నూకల దుర్గ బాబు,బళ్ల కుమార్, గెడ్డం అరుణ కుమార్జయ రత్నం, నూకల మోహన్ దేశంశెట్టి చిన్నా, పట్టా శివ, కూటమి శ్రేణులు,కార్యకర్తలు, అభిమానులున్నారు.
