
జనం న్యూస్ ఏప్రిల్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
పవిత్ర పుణ్య క్షేత్రం కుండలేశ్వరం లో వేంచేయున్న శ్రీ పార్వతి సమేత కుండలేశ్వర స్వామి వారిని శుక్రవారం సాయంత్రం రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి అదనపు కమిషనర్ డాక్టర్ యం సుధాకర్ కుటుంబ సమేతంగా దర్శించు కొన్నారు. వారికి కూటమి నాయకులు &ప్రజా ప్రతినిధులు & అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు కాళ్ళకూరి నాగ మల్లేశ్వర శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణ కుంభతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన కుండలేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణ లో గల రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి , కనక దుర్గమ్మ తల్లి , ఆంజనేయ స్వామి వారినీ దర్శించుకొని ప్రత్చేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో కాట్రేనికోన ఎంపీడీఓ బి రాజేశ్వర రావు , డిప్యూటీ ఎంపీడీఓలు శంకర్ నారాయణ, సూర్య నారాయణ రాజు, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు
