
జనం న్యూస్ మాకు అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి: మృతి చెందితే వారం రోజుల్లో మరిచిపోయే ప్రస్తుత పరిస్థితుల్లో కొన్నేళ్ల క్రితం మృతి చెందిన తన భార్య జ్ఞాపకాలతో ఏదో చేయాలనే తపన. పేదలకు సేవలు అందించాలనే ఆలోచన ఆయనకు రావటం విశేషం.. అది నిరంతరం కొనసాగించటం అందరికీ ఆదర్శం… అదే అయిన ఆచరిస్తూ వస్తున్నారు. భార్యపై ఆయనకున్న అభిమానాన్ని బహిర్గతం చేస్తుంది.. వివరాల్లోకెళితే అనకాపల్లికి చెందిన ప్రముఖ వాణిజ్యవేత్తా శరగడం శ్రీరామచంద్రమూర్తి చేస్తున్న కార్యక్రమాలు నిదర్శనం… ఆయన భార్య సహ ధర్మ చారిని బ్రతికినంత కాలం తోడుగా.. నీడగా.. తన విజయాలలో పాలు పంచుకుంటూ నిరంతరం సహకరించిన మహాలక్ష్మి మృతి చెందటం పట్ల ఆయన ఏదో విధంగా ఆమె పేరును పదిమందిలో ఉంచాలనే తపన ఏదో చేయాలనే ఆలోచన కు బీజం వేసింది.. అక్కడితో ఆగిపోలేదు. రామచంద్రా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు.. ఏదో చేయాలని ఆలోచనకు అంకురార్పణ చేశారు. అదే కొనసాగిస్తూ తన కృతజ్ఞతలు చాటుకుంటూ 10 మందికి సేవలు అందిస్తున్నారు.. జార్జి క్లబ్ వేదికగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరికీ ఆదర్శoగా నిలుస్తున్నారు అనక తప్పదు.. శరగడం మహాలక్ష్మి జయంతి కార్యక్రమాన్ని గత మూడు రోజులుగా వివిధ సేవా క్రీడా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నారు. స్థానిక జార్జి క్లబ్లో టెన్నిస్..టేబుల్ టెన్నిస్.. షటిల్. వివిధ రకాల జిమ్ క్రీడలను నిర్వహిస్తున్నారు. క్రీడాకారులకు తన వంతు సహకారం అందిస్తున్నారు.. జార్జిక్ క్లబ్లో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసి వర్ధంతి జయంతి కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా పదిమందికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాకుండా పేదలకు వైద్య సేవలు అందించాలని తపనతో పలు కార్యక్రమాలను చేపట్టారు. ఈనెల ఐదున జార్జి క్లబ్బు లో లక్ష్మి డయాగ్నటిక్ గుంటూరు ఆధ్వర్యంలో పేదలకు బిపి మధుమేహం వంటి పరీక్షలను ఉచితంగా అందించాలని నిర్ణయించారు అంతే కాకుండా డాక్టర్ రామ్మూర్తి డాక్టర్ ఎం జగన్ మోహన్ రావు ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.. పలువురికి మందులు కూడా పంపిణీ చేసేందుకు తగిన చర్యలు చేపట్టారు.. అలాగే వేల్పుల వీధి గుడి వద్ద పెద్ద ఎత్తున ఆదివారం అన్న సమారాధన ఏర్పాటు చేశారు.. అక్కడే అదేవిధంగా శాశ్వతం మంచినీటి పథకాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచి దాహార్తిని తీర్చాలని నిర్ణయం తీసుకున్నారు.. అలాగే జార్జి క్లబ్లో జరిగిన క్రీడల్లో విజయం సాధించిన వారందరికీ బహుమతి ప్రధానం కూడా అదే రోజు చేయనున్నారు ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయానికి వచ్చారు. నిరంతరం తన భార్య జ్ఞాపకాలతో సంపాదించిన దానిలో కొంత ఖర్చు చేయాలని నిర్ణయానికి రావడం అందరికీ ఆదర్శం అనక తప్పదు.. ఏది ఏమైనప్పటికీ మహాలక్ష్మి జయంతి సందర్భంగా కొంతమంది పేదలకైన తన వంతు సహాయం అందించాలనే ఆయన లక్ష్యం నెరవేరేందనే చెప్పవచ్చు..