
జనం న్యూస్ : 4 ఏప్రిల్ శనివారం;సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రిన్సిపాల్ యాళ్ల భాస్కర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయంలో శనివారం రోజున గ్రీన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెట్ల పెంపకం, పర్యావరణ అనుకూల కార్యకలాపాలు, ఆకుపచ్చ నేపథ్య సంఘటనలు తదితర అంశాలపై ప్రిన్సిపాల్ విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ లిఖిత, ఉపాధ్యాయులు వాణిశ్రీ, రత్నమాల, కావేరి, భరతమాత, దేవిక, ఫిరదోజ్, భారతి, మమత, మనూష తదితరులు పాల్గొన్నారు.