
జనం న్యూస్ 04 ఏప్రిల్ 2026
ప్రజల ఆగ్రహం జహీరాబాద్ గడ్డపై అక్రమ మైనింగ్ ఇటుక దందా బహిరంగంగా కొనసాగుతోంది ప్రజల ఆగ్రహం పెరుగుతోంది అధికారుల నిర్లక్ష్యం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాత్రింబవళ్లు అక్రమంగా మట్టి తవ్వకాలు సాగిస్తూ ట్రాక్టర్లు లారీలు నిరంతరం రాకపోకలు కొనసాగిస్తున్నాయి పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నా పట్టించుకునే వారు లేరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ భూములు పాడవుతున్నాయని భూగర్భ జలాలు దిగజారుతున్నాయని రైతులు అంటున్నారు ఇటుక బట్టీల కోసం నియమ నిబంధనలు పట్టించుకోకుండా అక్రమంగా మట్టి తరలింపు జరుగుతోందని ఆరోపిస్తున్నారు స్థానిక ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో అక్రమ దందా మరింత విస్తరిస్తోందని మండిపడుతున్నారు వెంటనే అక్రమ మైనింగ్ ఇటుక దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు లేదంటే పెద్ద స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు

