
జనంన్యూస్. 04.నిజామాబాదు. శ్రీనివాస్ పటేల్..
నిజామాబాదు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అభిమానుల దీక్షను విరూమింపజేసిన నిజామాబాద్ నగర కార్పొరేషన్ డిసిసి అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ.కాంగ్రెస్ పార్టీలో మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కు అన్యాయం జరుగుతుందని భావించిన తన అనుచరులు చేసిన చేస్తున్న దీక్ష శిబిరాన్ని నిజామాబాద్ నగర కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ సందర్శించి వారితో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల వారికి సమాన న్యాయం జరుగుతుందని, నాయకులు పార్టీ కోసం చేసిన కృషిని చూసి సమాన న్యాయం చేస్తారని,సమయాన్ని బట్టి పదవులు కేటాయిస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మున్నూరుకాపులకు అన్యాయం జరుగుతుందని సంజయ్ అనుచరులు అనుకోవడం సరైనది కాదు అని ఎందుకంటే నిజామాబాద్ నగర కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులుగా మున్నూరు కాపు బిడ్డనైన నాకు అవకాశం ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా రాంభూపాల్ కు ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 10 కార్పొరేటర్ స్థానాలను మున్నూరు కాపులకు కేటాయించడం జరిగిందని,అదే విధంగా రాష్ట్ర స్థాయిలో పలు మున్సిపాలిటీల్లో చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా, తదితర నామినేట్ పదవులు కేటాయించడంతో పాటు, యువజన కాంగ్రెస్, NSUI లాంటి ఇతర కీలక పదవులను మున్నూరుకాపులకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగిందని, ఇంకా రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ సమయాన్ని బట్టి అవకాశాలు కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు, కావున అందరు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా కలిసి పనిచేయాలే కానీ పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయకూడదని, ధర్మపురి శ్రీనివాస్ గారి అనుచరులుగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని, రాబోయే ఎన్నికల్లో 2029లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడే విధంగా నిజామాబాద్ అర్బన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపించుకునే విధంగా అందరం కలిసి ముందుకు అడుగులు వేయాలని బొబ్బిలి రామకృష్ణ తెలిపారు.
