
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ ఏప్రిల్ 04 పెబ్బేరు శనివారం
పెబ్బేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాత విద్యార్థుల సమ్మేళనం అలుమ్ని మీట్ ఘనంగా జరిగింది దశాబ్దాల క్రితం ఇక్కడ విద్యనభ్యసించిన విద్యార్థులంతా ఒక్కచోట చేరి తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షులు కొత్తకాపు శివసేన రెడ్డి పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశలో గడిపిన క్షణాలు జీవితాంతం గుర్తుంటాయని పాత మిత్రులను కలుసుకోవడం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు సాంకేతిక విద్యను అభ్యసించిన పాత విద్యార్థులు ప్రస్తుతం సమాజంలోని వివిధ ఉన్నత పదవుల్లో ఉండటం గర్వకారణమన్నారు క్రీడల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కళాశాలలో క్రీడా మైదానాల అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు
మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పెబ్బేరు పాలిటెక్నిక్ కళాశాల ఎందరో గొప్ప ఇంజనీర్లను తీర్చిదిద్దిందని కొనియాడారు పాత విద్యార్థులు తమ సొంత కళాశాల అభివృద్ధికి ప్రస్తుత విద్యార్థుల ఉపాధి అవకాశాలకు అండగా నిలవాలని కోరారు పట్టణ ప్రథమ పౌరుడిగా కళాశాల మౌలిక వసతుల కల్పనలో ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు కళాశాల ప్రాంగణం పాత విద్యార్థుల సందడితో కోలాహలంగా మారింది చదువు చెప్పిన అప్పటి ప్రిన్సిపాల్ గంధం రంగస్వామి గురువులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జయచంద్ర వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి కౌన్సిలర్లు పర్వీన్ షకీల్ తాటికొండ కృష్ణ, మార్కెట్ వైస్ చైర్మన్ విజయ వర్ధన్ రెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ కారుపాకుల వెంకట్ రాములు మార్కెట్ డైరెక్టర్ రామన్ గౌడు దయాకర్ రెడ్డి రంజిత్ కుమార్ రణధీర్ రెడ్డి మాజీ డైరెక్టర్ రాములు కాంగ్రెస్ నాయకులు వివిధ బ్యాచ్లకు చెందిన పాత విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.