
జనం న్యూస్ ఏప్రిల్ 4 తాళ్ళరేవు ముమ్మిడివరం నియోజకవర్గం, డా.బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
తాళ్లరేవు శ్రీ పెద వేంకటేశ్వరస్వామికి పూజలు నిర్వహించిన వైయస్సార్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ
కూటమి ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని స్వామికి వేడుకోలు
--రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న బీ.ఆర్. నాయుడు ను తక్షణమే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించేలా జ్ఞానోదయం కలిగించాలని వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులు పితాని బాలకృష్ణ వెంకటేశ్వరస్వామిని వేడుకున్నారు. వైసీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారి .ఆదేశాల మేరకు ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్ళరేవులో శ్రీ పెద వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇద్దరూ హిందూ మతానికి ఎంతో మేలు చేస్తున్నట్లు నటిస్తూ తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల లడ్డూ అంశంలో వైసీపీ అధినేత శ్రీ జగన్ మోహన్ రెడ్డి పై గత వైసీపీ ప్రభుత్వ పెద్దలపైనా లేనిపోని విమర్శలు చేస్తూ..కాలక్షేపం చేస్తున్నారని, నిజానికి కోర్టులు కూడా ఈ అంశంలో ఎటువంటి తప్పు జరగలేదని చెబుతున్నా, నేటికి అదేపనిగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు లైంగిక వేధింపుల ఆరోపణల్ని పట్టించుకోకుండా దేవ దేవుడి ఆలయానికి తీవ్ర అపచారం చేస్తున్నారని విమర్శించారు. వీరికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తగిన శాస్తి చేస్తారని అన్నారు. బీ ఆర్ నాయుడు తక్షణమే పదవినుండి వైదొలగాలని డిమాండ్ చేశారు. వైసీపీ ముమ్మిడివరం ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఈ కార్యక్రమంలో మాట్లాడారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఎస్.ఈ. సీ) సభ్యురాలు శ్రీమతి కాశీ బాల ముని కుమారి, పీ. గన్నవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు శ్రీ చింతలపాటి శ్రీనివాసరాజు,
మండల వైసీపీ అధ్యక్షుడు శ్రీ కాదా గోవిందు, జెడ్పీటీసీ శ్రీ దొమ్మేటి సాగర్ శామ్యూల్, కాట్రేనికోన మండల అధ్యక్షులు శ్రీ నల్లా నరసింహమూర్తి, నాలుగు మండలాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళ నాయకులు అభిమానులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు వివిధ కమిటీల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పాల్గొన్నారు.
