
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 5
తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లి గ్రామంలో ఆధ్యాత్మికశోభసంతరించుకుంది. గ్రామంలోని శ్రీ విరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో 29 అడుగుల ఎత్తు గల భారీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం శనివారం అత్యంత వైభవంగా జరిగింది.వేదమంత్రాలసాక్షిగా..వీరాంజనేయసేవాసమితిఆధ్వర్యంలో నిర్వహించినఈకార్యక్రమంలో వేద పండితులు ఓరుగంటి పవన్ కుమార్ శర్మ, ఓరుగంటి శ్రీరామ శర్మ తమ వేద మంత్రోచ్ఛారణలతోశాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యంత్ర స్థాపన, విగ్రహ ప్రతిష్ట వంటి కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగాయి.ఈ మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరాంజనేయ సేవా సమితి ప్రతినిధులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. విగ్రహ ప్రతిష్ట అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ అందజేశారు