
జనంన్యూస్. 05.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారత దేశ ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు సామాజిక న్యాయ సాధకుడు అయిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఇట్టి వేడుకలను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి మరియు అదనపు డీసీపీ (సి.ఏ.ఆర్) కె. రామ్ చందర్ రావ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా అదనపు డీసీపీ లు మాట్లాడుతూ 1908 ఏప్రిల్ 5న బీహార్ లోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన జగజ్జీవన్ రామ్ చిన్నప్పటి నుండే కుల వివక్షను మరియు అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. కానీ ఆ అడ్డంకులు ఏవీ ఆయన సంకల్పాన్న అడ్డుకోలేకపోయాయి. విద్య ద్వారానే మార్పు సాధ్యమని , అంటరానితనాన్ని నిర్మూలించడానికి మరియు అణగారిన వర్గాలకు గౌరవాన్ని కల్పించడానికి ఆయన 1935లో అఖిలభారత అనగారిన వర్గాల లీగ్‌ను స్థాపించారు. ఒక దేశంలోని బలహీన పౌరులకు సాధికారత కల్పించే వరకు ఆ దేశం నిజంగా స్వేచ్ఛగా ఉండలేదని ఆయన విశ్వసించారు ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన రాజకీయ జీవితం దేశానికి ఒక అనిర్వచ నియమమైన స్తంభం గా నిలిచింది భారత రక్షణ మంత్రిగా 1971 యుథ్థంలో ఆయన నాయకత్వం కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత ఉప ప్రధానిగా ఆయన పరిపాలన నైపుణ్యం స్వతంత్ర అనంతరం భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో సహాయపడింది. హరిత విప్లవంలో వ్యవసాయ మంత్రిగా ఆయన పోషించిన పాత్ర దేశ సంక్షేమం పట్ల ఆయనకున్న అంకితభావాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి అని , నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దలం నిలిచిన ఆయన జీవితం మనందరికీ స్ఫూరిదాయకం అన్నారు.
ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ (వెల్ఫేర్ మరియు హోంగార్స్), రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్ ( ట్రాఫిక్ ) , స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు సంతోష్ రెడ్డి , సాయన్న , సిసిఅర్బీ ఎస్ఐలు శివరాం , విజయ్ కుమార్, పోలీస్ కార్యాలయం సూపరింటెండెంట్ శంకర్ , మరియు పోలీస్ కార్యాలయ సిబ్బంది సిసిఆర్బి సిబ్బంది స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది సి సి ఎస్ సిబ్బంది సెంట్రల్ కంప్లైంట్ సెల్ సిబ్బంది ఐటి కోర్ సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది హోమ్ గార్డ్స్ తదితరులు పాల్గొనడం జరిగింది.
