
జనం న్యూస్ 05 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
బిఎస్పీ జోగులాంబ గద్వాల్ జిల్లా ఉపాధ్యక్షులు బండారు ఎస్. రాజ్ (జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రం)
జిల్లా కేంద్రం లో జిల్లా ఉపాధ్యక్షలు బండారు ఎస్. రాజ్ మాట్లాడుతూ……'విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం దుర్మార్గం అని అన్నారు, 14 లక్షల మంది విద్యార్థుల భవితకు గొడ్డలిపెట్టులాంటిది. ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ తీర్పు వచ్చింది'అని విమర్శలు చేసారు, ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, తక్షణమే హై కోర్ట్ లో పిల్ వెయ్యాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థుల తరుపున ఉద్యమం పూనకుంటామని హెచ్చరించారు, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని, హైకోర్టు తీర్పును అడ్డు పెట్టుకుని విద్యార్థుల ఫీజుల చెల్లింపు పథకాన్ని ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం లో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రూ.6 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు."