
జనం న్యూస్ 05 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
బి ఆర్ యస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గజ్వేల్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీస్ శాఖ పూర్తిగా గాడితప్పిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు..ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కార్యాలయానికే రక్షణ లేకపోతే సాధారణ ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ఎలా భద్రత కల్పిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలపై దాడులు జరగడం అత్యంత ప్రమాదకర పరిణామమని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు..ఇలాంటి ఘటనలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి తీవ్రంగా దిగజారిపోయిందని ఆయన తీవ్రంగా ఎద్దేవా చేశారు. వెంటనే దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.నిందితులను అరెస్టు చేయని పక్షంలో రాష్ట్రంలో బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రులను ఎమ్మెల్యేలను ప్రజా ప్రతినిధులను ఎక్కడ వారిని అక్కడే అడ్డుకుంటామని హెచ్చరించారు.