
జనం న్యూస్ ఏప్రిల్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం ఆధ్వర్యంలో ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల ఆధునీకరణకు నిధులు తీసుకురావడంలో ఎంతో కృషి చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారిని బిజెపి నేతలు మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువాలతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం మాట్లాడుతూ లొల్ల లాకులు మరియు బ్రిడ్జి నిర్మాణం కోసం ఆ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని ఆ ఇబ్బందులు గుర్తించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి లాకులు మరియు బ్రిడ్జి నిర్మాణం కోసం భారీ స్థాయిలో నిధులు సుమారు 74.20 కోట్ల రూపాయలు మంజూరు చేయడం హర్షనీయమని కొనియాడారు. లొల్ల లాకుల ఆధునీకరణకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఏపీ బిజెపి అధ్యక్షుడు పి.వి.ఎన్ మాధవ్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షుడు పొనుగుపాటి శ్రీనివాస్ బిజెపి కొత్తపేట మండల అధ్యక్షుడు సంపతి కనకేశ్వరరావుబిజెపి పార్టీ తరపున నూతనంగా నియమితులైన కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గొలకోటి వెంకటేశ్వరరావు, బిజెపి పార్టీ తరపున ఆత్మ కమిటీ డైరెక్టర్ మద్దింశెట్టి శ్రీనివాసరావు,బిజెపి పూర్వపు మండల అధ్యక్షుడు పాలాటి మాధవ స్వామి, బిజెపి సీనియర్ నాయకులు కోటిపల్లి సుబ్రహ్మణ్యం, బిజెపి ఎస్సీ మోర్చ నాయకులు అజ్జరపు సత్యనారాయణ, బిజెపి కిసాన్ మోర్చ జిల్లా కార్యవర్గ సభ్యులు కోటిపల్లి రఘురాం వేణుగోపాల్, బిజెపి సీనియర్ నాయకులు అన్యం సత్యనారాయణ, బిజెపి యువమోర్చ నాయకులు కోటిపల్లి దామోదర్ , యువమోర్చ మండల అధ్యక్షుడు వలపశెట్టి కిరణ్, కంచు స్థంభం శ్రీనివాస్ , కోటిపల్లి పళ్లంరాజు,ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.
