జనం న్యూస్:-10/01/2025 మండల ప్రతినిధి
యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు .
పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన యువ చైతన్య యూత్ సభ్యులు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ పర్వదినం సందర్బంగా అంగరంగ వైభవంగా క్రీడలు నిర్వహిస్తున్నారు.ఈ సం ,కూడా 11 వ వార్షికోత్సవ కబడ్డీ క్రీడోత్సవాలు ఈ నెల 12, 13, తేదీలలో ఉమ్మడి జిల్లా స్థాయి లో కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు యూత్ అధ్యక్షుడు ఏడవెల్లి సోమేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ గౌరవ అధ్యక్షుడు మారం శ్రీనివాస్ ,అలాగే కార్యదర్శి ఎలామకంటి సందీప్ ,యూత్ సభ్యులు కమ్మగాని శ్రీకాంత్,తండా శివ గదేపక గణేష్,గజ్జి నాగరాజు బుర్ర భారత్,వనం నరేష్,మచ్చ సాయి ,యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు