
జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐపీఎస్
జనం న్యూస్ 06 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి
వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో తాజాగా నిర్వహించిన దాడుల్లో రేషన్ బియ్యం అక్రమ నిల్వలను పట్టుకోవడంతో పాటు, పేకాట స్థావరంపై దాడి చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా,ఐపిఎస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ కేసుల వివరాలను వెల్లడించారు:రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై దాడులు:కుల్కచర్ల మండల కేంద్రంలో పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా బృందం మెరుపు దాడులు నిర్వహించింది. కుల్కచర్ల గ్రామానికి చెందిన అంగడి ప్రదీప్ (38) తన నివాసంలో నిల్వ ఉంచిన 38 బస్తాల (1900 కిలోలు) బియ్యాన్ని, అలాగే ముగుద రవితేజ (28) తన దుకాణంలో దాచిన 31 బస్తాల (1550 కిలోలు) బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 34.5 క్వింటాళ్ల ప్రభుత్వ బియ్యాన్ని సీజ్ చేసి, నిందితులను కుల్కచర్ల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగినట్లు ఎస్పీ తెలిపారు.
తాండూరులో పేకాట రాయుళ్ల అరెస్ట్:మరో ఘటనలో, తాండూరు పట్టణంలోని మాణిక్నగర్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో బండి శ్యామ్, కె. చందర్, నాస్కంటి నర్సింలు, అలంపల్లి రాము, బిచం రాజు, వి. తిరుపతి అనే ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 3,050 నగదును స్వాధీనం చేసుకుని, తాండూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వివరించారు.ఎస్పీ గారి హెచ్చరిక:"జిల్లాలో పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించినా, లేదా బహిరంగ ప్రదేశాల్లో పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా సహించే ప్రసక్తే లేదు. చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడే వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడమైనది. ప్రజలు కూడా ఇలాంటి చట్ట విరుద్దమైన చర్యలకు పాల్పడితే పోలీసులకు తెలియజేయాలి," అని ఎస్పీ స్నేహ మెహ్రా స్పష్టం చేశారు.