
పరిగి నియజకవర్గం నుండి పెద్ద ఎత్తున హాజరైన సర్పచ్ లు,మరియు ఉపసర్పంచ్ లు
జనం న్యూస్ 06 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి
మాల ఎడ్యుకేషన్ ల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఉమ్మడి రంగరెడ్డి జిల్లా వివిధ నియజకవర్గం లలోని మాల ప్రజా ప్రతినిధులకు హిమాయత్ నాగర్ లోని ఎం.ఎస్.ఎస్. గార్డెన్&ఫంక్షన్ హల్ లో రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహిచిన కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా నుండి తాండూరు,వికారాబాద్,కొడంగల్,పరిగి నియజకవర్గల నుండి సుమారు యాభై మంది ప్రజా ప్రతినిధులకు సన్మానం చెయ్యడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో దళిత సంఘాల వ్యవస్థక అధ్యక్షుడు అంబేద్కర్ గారి పైన 14 గంటలు నిర్విరామంగా ప్రసంగిచి వరల్డ్ బుక్ రికార్డ్ జె.బీ. రాజు మరియు మాల మహానాడు నాయకులు చెన్నయ్య,మందల భాస్కర్,బేర బాలకిషన్ ఉద్యోగులు మరియు విద్యార్ధి సంఘాలు నాయకులు రాహుల్,వివిధ మాల అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మనకు ఎన్నో రోజులుగా మనకు గుడికి ,బడికి దూరం చేసిన మనువాద వ్యవస్థ నుండి ఈరోజు ఒక్క ప్రజా ప్రతినిధులుగా రాజ్యగా బద్ధంగా హక్కులు కలిపించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కు ప్రతీ ఒక్క ధన్యవాదాలు తెలపాలని,అదేవిధంగా అన్ని వర్గాల మహిళలకు హక్కులు కలిపించిన మహనీయుడు అని,మీ గ్రామంలోని అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉండాలని,కుల,మత బేధాలు లేకుండా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని,అదేవిధంగా ప్రతి ప్రజాప్రతినిధి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకోవాలని ,ప్రస్తుతం రాజ్యాంగ ప్రమాదంలో పడుతుందని దీన్ని కపుడుకోవలని నూతన సర్పంచ్ లకు ,ఉపసర్పంచ్ లకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో పరిగి నియజకవర్గం నుండి ఎం.యాదయ్య,కూడవంద్ పూర్ సర్పచ్,ఉమ్మెంతల్ సర్పంచ్ జానకి సుభాష్,కండ్లపల్లి సర్పచ్ పవిత్ర అబ్రహం,కడుమూర్ సర్పంచ్ శివశంకర్,కిష్టపూర్ సర్పంచ్ వరలక్ష్మి నర్సిములు,గడిసింగపూర్,సోమన్ గుర్తి ,సర్పచ్ లు ,మరియు కుల్కచెర్ల ఉపసర్పంచ్ విజయ్,నర్సయ్యగూడ ఉపసర్పంచ్ నగేష్,జపర్ పల్లి ఉప సర్పంచ్ అంజి,మరియు వివిధ గ్రామాల మాల ఉపసర్పంచ్ లు మరియు వార్డుమెంబర్స్ జపర్ పల్లి శ్రీనివాస్,మంచనపల్లి వెంకటయ్య,కంకల్ సురేందర్,,లక్నపూర్ నర్సిములు,వెంకటయ్య,లక్మిదేవ్ పల్లి నవీన్ కుమార్,మరియు వివిధ గ్రామాల వార్డ్ సభ్యులకు మాల ఎడ్యుకేషన్ ల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరిగి నుండి అంబేద్కర్ విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి మంచనపల్లి శ్రీనివాస్,నియజకవర్గం అంబేడ్కర్ విజ్ఞాన వేదిక అధ్యక్షులు ఎన్.నర్సిములు,ప్రధాన కార్యదర్శి ఎం.నర్సిములు,కార్యవర్గసభ్యులు రాంచెందర్,శ్రీశైలం,మాల మహానాడు నాయకులు సుల్తాన్ పూర్ వెంకటయ్య,కడుమూర్ రాజు,కిష్టపూర్ రాజు,కోళ్ల యాదయ్య,నారాయణ,లక్నపూర్ యాదయ్య,శ్రీనివాస్,జంగయ్య,నర్సిములు, మీడియా చిలపూర్ రాజు వివిధ గ్రామాల మాలమహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు