
రాజ్యాంగ వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపాల్సిందే!
నరసరావుపేట (పల్నాడు): రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లను, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సామాజిక విద్వేషాలు రెచ్చగొడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) గళమెత్తింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు గుండాల నగేష్ మాదిగ నేతృత్వంలో సోమవారం నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో (PGRS) ఎస్పీకి ఫిర్యాదు చేశారు.తప్పు చేసిన వాడే.. రివర్స్ కేసు పెడతారా?
గతంలో చిలకలూరిపేట పట్టణానికి చెందిన నవతరం పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి, తన కార్యాలయంలో బహిరంగంగా ఎస్సీ రిజర్వేషన్లను మరియు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని రద్దు చేయాలని కరపత్రాలు విడుదల చేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఎమ్మార్పీఎస్ నేతలు మండిపడ్డారు. దీనిపై ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటా సుబ్బు మాదిగ సదరు వ్యక్తిని మర్యాదపూర్వకంగా కలిసి వివరణ కోరగా, సరైన సమాధానం చెప్పకపోగా.. ఇప్పుడు రివర్స్ కేసులకు తెరలేపారని ధ్వజమెత్తారు.
తప్పుడు ఎఫ్.ఐ.ఆర్ లతో భయపెట్టలేరు కోటా సుబ్బు తన అనుచరులతో వచ్చి దాడి చేశారంటూ సుబ్రహ్మణ్యం పోలీసులకు అబద్ధపు ఫిర్యాదు చేయడాన్ని ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండించింది. బాధితుడినే నిందితుడిగా చిత్రీకరిస్తూ కోర్టు కానిస్టేబుల్ ద్వారా ఫోన్ చేయించి బెదిరింపులకు దిగడం హేయమని నేతలు పేర్కొన్నారు. "చట్టాన్ని రద్దు చేయమన్న వాడే చట్టం ముసుగులో తప్పుడు కేసులు పెట్టడం విడ్డూరంగా ఉంది" అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎస్పీ హామీ పూర్తి విచారణ జరిపి న్యాయం చేస్తాం
ఈ మేరకు ఎస్పీ గారిని కలిసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు గుండాల నగేష్ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటా సుబ్బు మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు జమ్మలమూడి విజయ మాదిగ మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.