
జనం న్యూస్ ఏప్రిల్ 6 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో భూసార సంరక్షణ, భూ సుపోషణ కార్యక్రమాము తెలంగాణలో, ఉద్యమ రూపంలో మార్చి19 నుండి ఏప్రిల్ 19కొనసాగుతున్నాయి. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియజీవ ఎరువులను ప్రోత్సహించడం, భూసార పరీక్షలు చేయడం, మరియు దేశవాళీ విత్తనాల వినియోగం ద్వారా భూమికి జీవం పోయడంఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.'కృష విజ్ఞాన్ కేంద్రం తునికి శాస్త్రవేత్తడాక్టర్ రవి కుమార్ ఆధ్వర్యంలో ఫైజాబాద్ లో ఘనంగానిర్వహించారు.భూసార పరిరక్షణపై రైతులను జాగృతం చేస్తున్నారు. భూసార పరీక్షలు: నేల సారాన్ని బట్టి పంటలను మార్చడం మరియు ఎరువుల వినియోగాన్ని క్రమ బద్ధీకరించడం కోసం ప్రతి గ్రామంలో రైతులు భూసార పరీక్షలుచేయించుకోవాలన్నారు.చాలా సాగు భూములలో, ముఖ్యంగా ఇసుక, నల్లరేగడి నేలల్లో,నత్రజని,భాస్వరం ,మరియు పొటాష్, వంటి పోషకాలు తగ్గుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
నివారణ చర్యలు పంట మార్పిడి, పచ్చిరొట్ట ఎరువులు, వర్మీ కంపోస్ట్, మరియు జీవామృతం వంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించడం ద్వారా నేల సారాన్ని పెంచవచ్చు అనితెలిపారు.
రైతులు ప్రతి3సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్షలు చేయించాలి.రసాయన ఎరువులకు బదులుగా పశువుల ఎరువు వాడాలని తెలియజేశారు.కార్యక్రమంలో సర్పంచి రాములు ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి మాజీ సర్పంచ్,మనోహరనరసింహారెడ్డి.నర్సింహారెడ్డి.గోపాల్ రావు.జైపాల్.కుమార్.సత్యగౌడ్ .అశ్విన్ రెడ్డి. సుభాష్.శ్రీకాంత్, ఎం సీ.విఠల్.రాంరెడ్డి.సందీప్ రెడ్డి.వీరేశం.వరప్రసాద్ రెడ్డి.ప్రవీణ్ .సుభాష్.కిషన్ రెడ్డి గ్రామ రైతులు పాల్గొన్నారు.