▪️ఎవరి నిర్లక్ష్యం.. రైతు కి తీరని నష్టం..
▪️ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోని అధికారులు..
▪️రైతు దాట్ల మల్లయ్య..
జనం న్యూస్ //ఫిబ్రవరి //13//జమ్మికుంట //కుమార్ యాదవ్.. వీణవంక మండలంలోని కొండపాక గ్రామంలో మానేరు పరివాక ప్రాంతంలో పొలాల గట్టు పక్కన ట్రాన్స్ఫార్మర్ ఎంతో ప్రమాదకరంగా మారింది.,దాట్ల మల్లయ్య, తండ్రి కనకయ్య అనే రైతు ఎడ్ల ను పొలం గట్ల వైపున మేపుతుండగా అకస్మాత్తుగా ట్రాన్స్ఫర్ కనెక్షన్ కు తగిలి ఎద్దు మృతి చెందినట్లుగా, రైతు మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దాంట్ల మల్లయ్య( రైతు ) ఇ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నోసార్లు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులకు చెప్పగా, పట్టించుకోలేదు అని తెలిపారు. మనుషులకు చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పిన కూడా పట్టించుకోలేదు, అని వివరించారు. కనీసం దాని చుట్టూ (కంచే )వెయ్యండి అని ఎన్నో సందర్భాలలో అధికారులకు తెలిపారు అని అన్నారు. కానీ ఇ రోజు నా ఎద్దు అకస్మితంగా, ట్రాన్స్ఫార్మర్ యొక్క వైరు తగిలి, మరణించింది, అని శోకసముద్రంలో మునిగారు. చుట్టుపక్కల వారు గమనించి నన్ను, ఎద్దు వద్ద కు వెళ్ళనీయకుండా, ఆపారు అని బాధ తో మాట్లాడారు.కరెంట్ లైన్ మెన్ కు ఫోన్ చేయగా వారు విద్యుత్ సరఫరా నిలిపివేసిన . చుట్టూ పక్కన ఉన్న రైతులు వచ్చి ఎద్దు ను పక్కకు లాగారన్నారు . కానీ అప్పటికే ఎద్దు మరణించిందని, తెలిసినా వెంటనే నా గుండె ఆగిపోయినంత పని అయిందని రైతు మల్లయ్య శోక సముద్రం లో మునిగారు .ఎద్దు ధర సుమారు 80.000 రూపాయల విలువ ఉంటుంది అని అన్నారు. ప్రభుత్వం ఆదుకొని సహాయం చేయాలని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.