
జనం న్యూస్ ఏప్రిల్ 6 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ఫతేనగర్ లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఫతేనగర్ ప్రాంతంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు కంచి మహేందర్, ఫతేనగర్ బ్రిడ్జ్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ- దేశాభివృద్ధి, సుశాసనం మరియు ప్రజాసేవ లక్ష్యాలతో ముందుకు సాగుతున్న పార్టీ అని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.అనంతరం కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను అభినందించారు.ఈ కార్యక్రమంలో రాదేశ్యాం, సురేష్, శివ, రవి, ఉషారాణి, వినీత్, దినేష్, బాలరాజ్, గోపాల్, దశరథ్, రాజు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.