
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 07-04-26
రాజంపేట పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం (యల్లటూరు భవన్)లో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఇటీవల రాజంపేట అడ్వకేట్ బార్ అసోసి యేషన్ వైస్ ప్రెసి డెంట్గా ఎన్నికైన సందర్భం గా కత్తి సుబ్బ రాయుడుని ప్రత్యే కంగా అభినందిస్తూ సన్మానించారు.ఈసందర్భం గా యల్లటూరు శ్రీనివాస రాజు మాట్లాడుతూ, జనసేన పార్టీ అభివృద్ధికి కత్తి సుబ్బరాయుడు అంది స్తున్న సేవలు,కృషి ప్రశంస నీయం అని తెలి పారు. భవిష్యత్తులో కూడా పార్టీ బలోపేతానికి ఆయన మరింత కృషి చేస్తారని ఆశాభావంవ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు యల్ల టూరు శివరామ రాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయ కులు మండెం అబూ బకర్,జన సేన పార్టీ నాయకులు కోలాటం హరి కృష్ణ, చలపతి, కొండ హరి, ఆకుల చలపతి , పూల లక్ష్మీ నరసయ్య, పత్తి నారాయణ ,గాజులకు కులాయప్ప,మౌల ,పిచ్చయ్య నాయుడు ,సాంబారు రాజశేఖర్ ,చింతల రామ కృష్ణ, జనసేన పార్టీ నాయ కులు, కార్యకర్తలు పాల్గొని కత్తి సుబ్బ రాయు డు కి హృదయపూర్వకఅభినంద నలు తెలియ జేశారు.
