
కాట్రేనికోన గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భాగీర్తమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం మంగళవారం నిర్వహించనున్నారు. శని ఆది సోమవారాల్లోజాగారాలు నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. జాగారాల సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మంగళవారం నిర్వహించే తీర్థ మహోత్సవానికి సంబంధించి కాట్రేనికోనతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్న నేపథ్యంలో కాట్రేనికోన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.