
జనం న్యూస్ ఏప్రిల్ 7 ముమ్మిడివరం ప్రతినిధి
సవరప్పాలెం గ్రామ పంచాయతీ పాలకవర్గం పదవీకాలం ముగిసిన సంధర్భంగా సత్తి వెంకటరత్నం (శ్రీను బాబు) గారి ఆ ధ్వర్యంలో పదవీకాలం ముగిసిన సర్పంచ్ మరియు వార్డు సభ్యులను సన్మానం ఘనంగా నిర్వహించారు.ఈ సభలో పంచాయతీ అభివృద్ధి అధికారి సూరిబాబు ఈ 5 సంవత్సరాల కాలంలో గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు గురించి మరియు పాలకవర్గం సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గరిమెళ్ళ రవి గారు,సత్తి వెంకటరత్నం గారు,ఉప సర్పంచ్ కేతా సూరిబాబు గారు ,ఎంపిటిసి శ్రీమతి సత్తి ఆదిలక్ష్మి గారు,మాజీ సర్పంచ్ సత్తి నాగబాబు గారు, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు సత్తి రాంబాబు గారు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గరిమెళ్ళ రవి గారి ఆధ్వర్యంలో పదవీకాలం ముగిసిన సర్పంచ్ మరియు పాలకవర్గం సభ్యులను సచివాలయం సిబ్బంది ఘనంగా సన్మానించారు.
