
బిచ్కుంద ఏప్రిల్ 8 జనం న్యూస్కామారెడ్డి జిల్లా
బిచ్కుంద మండల కేంద్రంలో మండలంలోని పరిసర గ్రామాల అంగన్వాడీ టీచర్లకు కొత్త స్మార్ట్ఫోన్లను,చిన్నారులకు యూనిఫార్మ్లను పంపిణీ చేసిన జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీ కాంతారావు ..ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు కొత్త స్మార్ట్ఫోన్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.. పాతబడిపోయిన ఫోన్లతో అంగన్వాడీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు..పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల వివరాలు, పౌష్టికాహార పంపిణీ వంటి సుమారు 14 రకాల అంశాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయవచ్చని వివరించారు.ఈ కార్యక్రమం ద్వారా అంగన్వాడీల సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని తెలిపారు..

