
జనం న్యూస్ 08 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు అసాధ్యం అన్న దాన్ని-సుసాధ్యం చేసిన సంపత్ కుమార్ అలంపూర్ నియోజకవర్గంలో మొక్కజొన్న పండించిన రైతులకు గిట్టుబాటు ధర లేక తక్కువ ధరకే మధ్య దళారీలకు అమ్ముతున్న విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే స్పందించిన సంపత్ కుమార్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ని కలిసి అలంపూర్ నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. అలాగే రైతుకమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ ని, రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సురేంద్ర మోహన్ ను ఒప్పించారు. వెంటనే అలంపూర్ నియోజకవర్గంలో అయిజ మండల కేంద్రంలో పిఎసియస్ ఆధ్వర్యంలో ఒకటి, వడ్డేపల్లి మండలంలో మరొక మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తున్నట్లు సంపత్ కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు, రేపు, అనగా 9-4-2026( గురువారం) నాడు ఉదయం 10 గంటలకు అయిజ మార్కెట్ యార్డ్ (గంజ్)లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు *(ప్రారంభం)* చేయాలని ప్రభుత్వం నుండి జిల్లా డి యం ఆదేశం వచ్చిందని,అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్,అయిజ సింగిల్ విండో అధ్యక్షుడు పోతుల మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.కనుక మొక్కజొన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వెంటనే స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి( ఎ ఇ ఓ) తో పంట ధ్రువీకరణ తోపాటు, పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్కుల జిరాక్స్ కాపీలను సిద్ధం చేసుకుని ఉండాలని వారు కోరారు.