
జనం న్యూస్ 08 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
తెలంగాణలోని రైతాంగా నికి రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ అందించింది, యాసంగి సీజన్ కు సంబం ధించి కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్నా రైతు భరోసా రెండో విడత నిధు లు విడుదలకు రేవంత్ రెడ్డి,సర్కార్ ముహూర్తం ఖరారు చేసింది,పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా రెండో విడత తేదీలను ఫిక్స్ చేసింది. తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం ఏప్రిల్ 15న రెండో విడత నిధు లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మొత్తం మూడు విడతల్లో ఏప్రిల్ నెలాఖరుతో రైతు భరోసా నిధుల జమ పూర్తి చేయనుంది తెలంగాణ సర్కార్,ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పథకం కింద ఇప్పటికే తొలి విడతగా ఎకరాకు 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం రెండో విడత ఆర్థిక సాయాన్ని అందించేందుకు రెడీ అయింది. ఏప్రిల్ 15 లోపు రెండో విడత డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేయనుం ది. ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ ఇది వర్తిస్తుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మొదటి విడతలో అందిన మొత్తాన్ని మినహాయించి, ఐదు ఎకరాల వరకు ఉన్న మిగిలిన విస్తీర్ణానికి సరి పడా బ్యాలెన్స్ మొత్తాన్ని ఈ విడతలో జమ చేస్తారు.
అర్హులైన రైతులకు సకాలం లో చెల్లింపులు జరిగేలా చూసేందుకు, రెండవ విడత పంపిణీ కోసం దాదాపు 2,700 కోట్లను సమకూర్చుకోవాలని ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.