
ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
జనం న్యూస్, ఏప్రిల్ 08,అచ్యుతాపురం:
అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ కేంద్రమైన యలమంచిలి జిల్లా పరిషత్ అతిధి గృహ కార్యాలయంలో గ్యాస్ కొరత పుకార్లపై ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలో గ్యాస్ కొరత ఎక్కడా లేదని, గ్యాస్ కొరత ఉందంటూ ఒక్కొక్కరు రెండేసి మూడేసి సిలెండర్లు బుక్ చేసుకుంటూ, సకాలంలో గ్యాస్ రావడం లేదని పుకార్లు వినిపిస్తున్నాయని అదంతా వదంతులని ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఎవరికైనా గ్యాస్ రాకుండా ఇబ్బంది ఉంటే స్థానిక డీలర్స్ కు తెలియజేయాలని,వారిని సంప్రదిస్తే సరైన సమాచారం ఇస్తారన్నారు.అలాగే గ్యాస్ డెలివరీ బాయ్స్ ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ సృష్టిస్తున్నారని ప్రజలకు సమాచారం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, అంతే తప్ప బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళని ఎంకరేజ్ చేయద్దన్నారు. ఎన్డియే పెద్దలైన ప్రధాని నరేంద్ర మోడీ ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో దేశం, రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదన్నారు.
