జనం న్యూస్ ఫిబ్రవరి 14 : జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్ : జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : భారత కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ఇండియన్ పోలీస్ మెడల్ కు మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి ఎంపిక అయినందుకు గాను గురువారం బీజేపీ సీనియర్ నాయకులు, నిత్యాసాయి చార్టిబుల్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ రఘు మరియు ప్రముఖ వైద్యులు సాగర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఆకుల లింగా రెడ్డి సిఐ ని కలిసి ఘనంగా సన్మానించడం జరిగింది. పోలీస్ శాఖలో అందించిన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ కు మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి ఎంపిక కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐ నిరంజన్ రెడ్డిని శాలువ మరియు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.