
జనం న్యూస్-ఏప్రిల్ 9-నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ( ఎస్ పి ఎఫ్) ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని గురువారం జెన్కో ఎస్ ఈ రఘురాం ప్రారంభించారు. నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని జెన్కో చీఫ్ ఇంజనీర్ కార్యాలయం పక్కన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రత్యేక భద్రత దళం, జెన్కో ప్రత్యేక భద్రత దళం ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జెన్కో ఎస్ ఈ రఘురాం మాట్లాడుతూ నాగార్జునసాగర్ కు చెందిన నాగార్జునసాగర్ డ్యాం,జెన్కో ప్రత్యేక భద్రతా దళాలు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, స్వచ్ఛభారత్ మొదలగు కార్యక్రమాలను నిర్వహించి ఎస్ పి ఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా, జోన్ డిఐజి మాధవరావులచే ప్రశంసలు అందుకుంటున్నారని అన్నారు. వేసవికాలంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎస్ పి ఎఫ్ దళాలు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ పి ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ విజయభాస్కరరావు, సాగర్ డ్యాం ఆర్ ఐ శ్రీనివాసరావు, జన్కో ఆర్ ఐ ప్రతాప్ నాయుడు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ చెస్ట్ సిబ్బంది, ఎస్పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.