
బిచ్కుంద ఏప్రిల్ 9 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో బిచ్కుంద మున్సిపాలిటీ లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం లో . మున్సిపల్ చైర్ పర్సన్ సీమా శెట్కార్ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్ సందర్శించారు అనంతరం చైర్మన్ మాట్లాడుతూ. బిచ్కుంద మున్సిపాలిటీలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు మేను ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని ప్రిన్సిపల్ రాగిణి మేడం కి సూచించారు. అదేవిధంగా పాఠశాల ప్రాంగణంలో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించడం జరిగింది.

