
జనంన్యూస్. 09.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు 10/42026..శుక్రవారం రోజు తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ డైరెక్టర్ మరియు రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ఆయుష్ శాఖ వరంగల్ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో **ప్రజా పాలన --ప్రగతి ప్రణాళిక **లో భాగముగా హోమియోపతి పితామహుడు డాక్టర్ శామ్యూల్ haneman 271 జయంతి సందర్భంగా నిజామాబాద్ పట్టణం లోని పద్మశాలి సంఘం తర్ప నెంబర్ 10.కోటగల్లి లో ఉచిత హోమియో, ఆయుర్వేద, యునాని, యోగ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆయుష్ విభాగం ఇంచార్జి డాక్టర్ జె.గంగా దాస్ తెలిపారు.ఈ శిబిరం లో అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితముగా ఔషధములు పంపిణీ చేయడం జరుగుతుంది. మరియు ఔషధ మొక్కల ప్రదర్శన వాటి ప్రాముఖ్యత గురించి వివరించడం జరుగుతుంది.శుక్రవారం ఉదయం పాలిటెక్నిక్ మైదానంలో 6.30 నిం..నుండి 7.30, నిం..వరకు యోగ శిబిరం కలదు కావున ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని కోరుచున్నాను.