
జనం న్యూస్: 10 ఏప్రిల్ శుక్రవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
హోమియోపతి పితామహుడు డాక్టర్ సామ్యూల్ హానీమన్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సిద్దిపేటలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్ గంజి జనార్దన్‌ను సన్మానించారు.గ్రామ స్వరాజ్యం పార్టీ స్థాపకులు, అడ్వాకేట్ మాచవరం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హోమియోపతి వైద్య విధానం ప్రాముఖ్యతను వివరించి, సమాజానికి అందిస్తున్న సేవలకుగాను డాక్టర్ గంజి జనార్దన్‌ను అభినందించారు.కార్యక్రమంలో న్యాయవాది మేకల నరసింహారెడ్డి, పొన్నాల గ్రామ సర్పంచ్ వెంకటయ్య, పద్మశాలి చేనేత సంఘం అధ్యక్షులు ద్యావనపల్లి సత్యనారాయణ, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి దూస వేణు, ఓం శాంతి ఓంకార్, హైకోర్టు న్యాయవాది మాచవరం లలితా ప్రసాద్ రావు, మాజీ సర్పంచ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.గాంధీ స్మారక నిధి జిల్లా ఆర్గనైజర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న మాచవరం వెంకటేశ్వరరావు తన కుమారుడు, మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.