
జనం న్యూస్ ఏప్రిల్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన మండలం
పెనుమల్ల గ్రామ పంచాయతీని ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు ఆకశ్మిక సందర్శన చేశారు. పంచాయతీలకు సంబందించిన పలు రికార్డులను తనిఖీ చేశారు. పెనుమల్ల స్వర్ణ గ్రామ సచివాలయం సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు. సిబ్బంది సకాలములో హాజరు వేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. విధుల నిర్వాహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించారు.ప్రజనీకానికి నిరంతరం అందుబాటులో ఉంటూ, పౌర సేవలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కార్యదర్శి నాగేంద్ర & స్వర్ణ గ్రామ సచివాలయం సిబ్బందిని సూచించారు.*
