
జనం న్యూస్ ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి
మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకుని, నేడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
అమలాపురం గోకులే సెంటర్ పార్కు వద్ద ఉన్న పూలే విగ్రహానికి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు పూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయేల్ ,కుడుపూడి సూర్యనారాయణరావు ,రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు ,వంటెద్దు వెంకన్నాయుడు ,S.E.C మెంబర్ కుడుపూడి భరత్ ,జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర ,మాజీ మున్సిపల్ ఛైర్మన్ రెడ్డి సత్యనగేంద్ర మణి రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ,మండల,నాయకులు,కార్యకర్తలు,అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు
