
బిచ్కుంద ఏప్రిల్ 11 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం రోజు మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు సీమ గంగారం మాట్లాడుతూ , సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు పూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్ సర్పంచ్ తుకారాం. కాంగ్రెస్ నాయకులు దశరథ్ స్వామి. కాంగ్రెస్ యువ నాయకులు జాదవ్ సుచిత్ కుమార్. ఉత్తం చింతల్ హనుమాన్లు మార్కెట్ కమిటీ సిబ్బంది లాలు సందీప్ తదితరులు పాల్గొన్నారు

