
జనంన్యూస్. 11.నిజామాబాదు. రురల్.శ్రీనివాస్ పటేల్.
ధర్పల్లి మండలంలోని వాడి గ్రామంలో గత సీజన్లో అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సహాయం గురించి చర్చించేందుకు రావాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ని చర్చకు రావాలని పిలుపునిచ్చి భాజపా నాయకులు,కార్యకర్తలతో కలిసి వాడి గ్రామానికి వచ్చిన భాజపా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారిని పోలీసులు అరెస్ట్ చేశారు.వాడి గ్రామంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి చర్చకు రావాలని దినేష్ కులాచారి నిన్న పిలుపు నివ్వడంతో ముందస్తుగా భాజపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.