
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ ఏప్రిల్ 11పెబ్బేరు మండల్
విలెజ్ పెబ్బేరు మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపాన ఉన్న మహత్మ జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహానికి ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడుగోనెల బాలస్వామి గారి ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గోనెల బాలస్వామి గారు మాట్లాడుతూ. మహాత్మ జ్యోతిబాపూలే అనగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితమిచ్చిన మహా నాయకుడు అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనకు జీవితాంతం కృషి చేశారన్నారు.అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు గోనెల సహదేవుడు గారు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే గారు భారతీయ సామాజిక సంస్కర్త బడుగు బలహీన వర్గాల ఆరాధ్యదైవం స్త్రీ విద్య సమానత్వం కోసం పోరాడిన మహనీయుడిని ఆడపిల్లల విద్యా ద్వారాలకు మూసి ఉన్న తలుపులను తెరిచారన్నారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు చింతకాయల కురుమూర్తి కటికల బాలస్వామి చింతకాయల భీముడు సంగనమోని శ్రీనివాసులు కటికల ఆనంద్ మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు