
జనంన్యూస్. 13.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని జంగిలోడి తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఐడీసీఎంఎస్ వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభిచిన సర్పంచ్ భూక్య గంగాధర్. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ముఖ్యంగా రైతులకు వడ్లు దళరులకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారానే విక్రయించాలని రైతులకు తెలిపారు మంచిగా ఎండబెట్టి తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకురావాలి అని రైతులకు సూచించడం జరిగింది. లేనిచో రైస్ మిల్లు తరుగు తీసే అవకాశం ఉంటుంది కాబట్టి నాణ్యమైన వడ్లను సెంటర్లకు తీసుకువచ్చి సెంటర్ నిర్వాహకులకు సహకరించాలని సూచించడం జరిగింది. కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి గొల్ల ఎర్రన్న. సూపర్వైజర్ ప్రశాంత్. రావుట్ల గ్రామ సర్పంచ్ రాజకుమార్. ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మరియు సెంటర్ నిర్వాహకులు శివాజీ నాయక్.ఆడవాల ప్రసాద్. గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు