
జనం న్యూస్ ; 13 ఏప్రిల్ సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
సిద్ధిపేటలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (ఐపిఈ) 2026లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ సంవత్సరం కళాశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించి కళాశాలకు గౌరవాన్ని తెచ్చారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి హిమబిందు మాట్లాడుతూ, “తమ విద్యార్థినుల కృషి, అధ్యాపకుల కట్టుదిట్టమైన మార్గదర్శకత్వం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయి” అని తెలిపారు.ఈ సంవత్సరం కళాశాలలో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. అనేక మంది విద్యార్థినులు అత్యుత్తమ మార్కులు సాధించి రాష్ట్ర ర్యాంకులు సాధించారు. ప్రత్యేకంగా ఎంపీసీ ద్వితీయ సంవత్సర విద్యార్థిని మోకు హారిక 994/1000 మార్కులు సాధించి రాష్టస్థాయి 3వ ర్యాంకుని సాధించింది, బైపీసీ విభాగంలో బ్రాహ్మణి 981/1000, సిఇసి లో సాయి కీర్తన 980/1000, హెచ్ఇసి లో అక్షయశ్రీ 968/1000 ఉర్దూ మీడియం బీపీసీ లో ఆఫషా 883/1000, ఒకేషనల్ విభాగంలో ఉమారాణి 964/1000 మరియు మొదటి సంవత్సర ఫలితాలలో ఎంపీసీ లో ఐశ్వర్య 457/470, బీపీసీ లో సిఫా 428/440, సీఇసి లో 479/500, హెచ్ఇసి లో 470/500, ఒకేషనల్ లో 477/500 సాధించి మెరుగైన ఫలితాలు నమోదు చేశారు.
ఈ కళాశాల సురక్షిత వాతావరణం, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, నాణ్యమైన బోధన, ఉచిత పుస్తకాలు, స్కాలర్షిప్లు వంటి సదుపాయాలతో విద్యార్థినుల భవిష్యత్తును బలపరుస్తోంది.