
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 13 సెల్ 9550978955
చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరులోని జిల్లా పోలీస్ ఎస్పీ కార్యాలయంలో నూతనముగా స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అలహరి శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ దత్త సాయి వస్త్రంతో సత్కరించి వారికి సాయి సచ్చరిత్ర పుస్తకాన్ని బాబా ప్రసాదంగా ఇవ్వడం జరిగింది, ఈరోజే డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించడంతో పలువురు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసినారు, అనంతరం ట్రస్టు నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ మంచి మనిషి ఆధ్యాత్మిక సేవా తత్పరులు ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే మంచి గుణము, ఎన్నో క్లిష్టమైన కేసులను తన అనుభవంతో పరిష్కరించి ఎంతోమంది పేదలకు సహాయం చేసి, విధులు నిర్వహించిన ప్రతి ఒక్క ఊరిలో కూడా మంచి గుర్తింపు పొంది తనకంటూ పోలీస్ శాఖలో ప్రత్యేకమైన ముద్ర నేలకొల్పుకున్నారని, ఇప్పటివరకు జయ జయ సాయి ట్రస్ట్ కు ఎన్నో విధాలుగా తమ వంతు సహాయ సహకారాలు అందించారని అలాంటి మంచి మనిషికి మరింత జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు మద్దుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు